Akividu: రా.. చూసుకుందాం.. రఘురామ ఓపెన్ ఛాలెంజ్!
Akividu: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెద పేటలో తనపై జరిగిన దాడి ఘటనపై రఘురామకృష్ణరాజు తీవ్రంగా స్పందించారు.
Akividu: రా.. చూసుకుందాం.. రఘురామ ఓపెన్ ఛాలెంజ్!
Akividu: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం పునర్నిర్మాణం, పెద పేటలో జరిగిన దాడి ఘటనపై రఘురామకృష్ణరాజు స్పందించారు. శ్రీరామనవమి రోజు వెళ్ళినప్పుడు ఇక్కడి వారు కాకుండా బయటి వాళ్ళు దాడి చేయడానికి వచ్చారని రఘురామకృష్ణరాజు అన్నారు. బయట ఊర్లు నుండి తీసుకొని వచ్చి సడెన్ గా అటాక్ చేయడం జరిగిందన్నారు. పోలీసులు అందరినీ బయటకు పంపించారని అన్నారు.
మహిళలు నాకు బొట్టుపెట్టి కళ్ళలో కారంకొట్టి అటాక్ చేయడానికి ప్లాన్ చేసారని రఘరామకృష్ణరాజు అన్నారు. తాను రాముడికి దండ వేస్తే పెంటమ్మ అనే మహిళ ఆ దండను తీసివేసిందని అన్నారు. తాను వెలుతున్న కారుపై పిడిగుద్దులు గుద్దారని అన్నారు. తనపై హత్యాయత్నం చేయాలని చూసారని అన్నారు. నా నియోజకవర్గంలో నా స్వగ్రామంలో రామాలయంకు నేను వెళ్ళాలంటే కాలనీ వాళ్ళ పరిమిషన్ నాకు అవసరమా అంటూ మండి పడ్డారు రఘురామ.
వెబ్ లాండ్ అడంగల్ లో నాలగు సెంట్లు గుడి అని వేరే డాక్యుమెంట్ లలో రామాలయం అని క్లియర్ గా ఉందని ఇది తాహసిల్దార్ రిపోర్ట్ అని అన్నారు. అక్కడ రామ, లక్షణ, సీత, ఆంజనేయ విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయని అన్నారు. శివనాగిరెడ్డి అనే స్దపతి తో కృష్ణశిల తో రామాలయం నమూనా ఇవ్వడం జరిగింది. ఆ నమూనాతో ఆలయం నిర్మించాలని అనుకుంటున్నామని అన్నారు.
డెబ్బై ఐదు లక్షలు తో రామాలయం నిర్మిస్తామని అన్నారు. శ్రీరామ ఆలయ అభివృద్ధి సమితి, ఆకివీడు పేరుతో కెనరా బ్యాంక్ లో ఎకౌంటు ఏర్పాటు చేసామని రఘురామకృష్ణరాజు అన్నారు. ఆకివీడులో మండలంలో అనుమతి లేని చర్చిలు 113 ఉన్నాయన్నారు. హర్షకుమార్ పై ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు రఘురామకృష్ణరాజు.
ఆకివీడుకు హర్షకుమార్ వస్తే వచ్చేయాలని తప్ప వస్తే సిట్యువేషన్ వేరుగా ఉంటుంది. వార్ వన్ సైడ్ అవుతుంది అంటాడు. వస్తే వన్ సైడ్ ఏంటి.. రా.. వన్ సైడొ, టూ సైడ్సో చూపిస్తాం కదా..ఇక్కడ గాజులు తొడుక్కుని కూర్చోలేదు కదా..అని అన్నారు. అందరూ అన్ని మతాల పట్లా సమన్వయంతో ఉండాలని అన్నారు