Nandyala: పేదవాడి సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహ ప్రవేశోత్సవాలు
Nandyala: నంద్యాల నియోజకవర్గంలోని రైతు నగర్ శిల్పా నగర్‌లో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశోత్సవాలు ఘనంగా జరిగాయి.
Nandyala: పేదవాడి సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహ ప్రవేశోత్సవాలు
Nandyala: నంద్యాల నియోజకవర్గంలో గృహ ప్రవేశోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. రైతు నగర్ పరిధిలోని శిల్పా నగర్‌లో నిర్మించిన గృహాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 2,50,893 ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని, లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్త ఇళ్లలో నివాసం ప్రారంభించిన కుటుంబాలతో మాట్లాడి, వారి ఆనందాన్ని పంచుకున్నారు.
మంత్రి మాట్లాడుతూ, పేదలకు సొంత ఇల్లు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ సౌకర్యం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. కొత్త ఇళ్లను అందుకున్న లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, మున్సిపల్ కమిషనర్ శేషన్న, స్థానిక నాయకులు కోమలి హోటల్ మధు, మండల కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, లబ్ధిదారులు, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.