Nandyala: చిన్నారులకు కార్పొరేట్ స్థాయి వైద్యం!

Nandyala: నంద్యాల పద్మావతి నగర్‌లో నూతనంగా నిర్మించిన “స్టార్ పురిటి మరియు చిన్న పిల్లల ఆసుపత్రి”ని రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు.

Update: 2026-03-30 10:45 GMT

Nandyala: చిన్నారులకు కార్పొరేట్ స్థాయి వైద్యం!

Nandyala: నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్‌లో నూతనంగా నిర్మించిన “స్టార్ పురిటి మరియు చిన్న పిల్లల ఆసుపత్రి” (Star Children’s Hospital) ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, నంద్యాల వంటి అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో చిన్నపిల్లలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం శుభపరిణామమని తెలిపారు. చెన్నైలోని ప్రముఖ మెహతా హాస్పిటల్ వంటి సంస్థల్లో శిక్షణ పొందిన నిపుణులు ఇక్కడ సేవలు అందించడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో శిశువులను ఇతర నగరాలకు తరలించే అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు.

ఆసుపత్రి అధినేత డాక్టర్ కార్తికేయ కుమ్మిత మాట్లాడుతూ, తమ ఆసుపత్రిలో ప్రసూతి సేవలతో పాటు నూతన శిశువులకు (Neonatology) ప్రత్యేక వైద్యం, తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు అత్యాధునిక చికిత్సలు, 24 గంటల అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా సేవలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, డాక్టర్ ప్రియాం కుమ్మిత, కుమ్మితి శ్రీనివాసులు, డాక్టర్ రవి కృష్ణ, మనం వినయ్ కుమార్, మిద్దె హుస్సేన్, ఇంజనీర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News