Secunderabad: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో మద్యం మత్తులో యువతి హల్‌చల్

Secunderabad: పోలీసులకు చుక్కలు చూపించిన యువతి

Update: 2023-10-10 05:24 GMT

Secunderabad: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో మద్యం మత్తులో యువతి హల్‌చల్

Secunderabad: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో మద్యం మత్తులో యువతి హల్‌చల్ చేసింది. రెండు గంటల పాటు బోయిన్‌పల్లి ప్రధాన రహదారిపై నానా హంగామా సృష్టించింది. దీంతో పోలీసులు చివరికి ఆమెను పోలీస్టేషన్‌కు తరలించారు. ఈవెంట్ ఆర్గనైజర్ మద్యం మత్తులో వేగంగా కారు డ్రైవ్ చేసింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆమె వాహనాన్ని వెంబడించారు. కారును ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను ఢీకొట్టి పరారయ్యింది. చివరకు తాడ్‌బంద్‌ సమీపంలో కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. తన కారును ఆపిన పోలీసులను నానా బూతులు తిడుతూ హంగామా సృష్టించింది. అడ్డువచ్చిన కానిస్టేబుళ్లను తోసేసే ప్రయత్నం చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News