Republic Day Celebrations: ప్రభుత్వ నిర్ణయం పట్ల గవర్నర్ తీవ్ర అసహనం

Republic Day Celebrations: అనివార్య కారణాలతో రిపబ్లిక్ డే వేడుకలు జరపలేమన్న ప్రభుత్వం

Update: 2023-01-25 08:23 GMT

Republic Day Celebrations: ప్రభుత్వ నిర్ణయం పట్ల గవర్నర్ తీవ్ర అసహనం

Republic Day Celebrations: రిపబ్లిక్ వేడుకలకు సంబంధించి గవర్నర్ తమిళిసైకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది. అనివార్య కారణాలతో రిపబ్లిక్ డే వేడుకలు జరపలేమని తెలిపింది. రాజ్ భవన్‌లోనే వేడుకలు నిర్వహించాలని లేఖలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల గవర్నర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో వేడుకలు జరగకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించక పోవడమేనన్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్ భావిస్తున్నట్లు సమాచారం.

2020-21లో పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. 2021లో పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో గవర్నర్ - సీఎంకు మధ్య గ్యాప్ పెరగడంతో.. 2022లో రాజ్ భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈసారి కూడా రాజ్ భవన్ లోనే వేడుకలు జరపాలని గవర్నర్ నిర్ణయించారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రుల హాజరుపై ఉత్కంఠ కొనసాగుతుంది.

Tags:    

Similar News