Hyderabad: పోలీసుల అలసత్వం.. మరణించిన 20 రోజులకు కొడుకు శవం లభ్యం..!
Hyderabad: పోలీసుల తీరుకు నిరసనగా పీఎస్ ముందు కుటుంబసభ్యుల ధర్నా
Hyderabad: పోలీసుల అలసత్వం.. మరణించిన 20 రోజులకు కొడుకు శవం లభ్యం..!
Hyderabad: నగరంలోని చాదర్ ఘాట్ పోలీసులు విధుల్లో అలసత్వం ప్రదర్శించారు. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 6న అర్థరాత్రి శ్రవణ్ కుమార్ అనే యువకుడిని కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రవణ్ మృతి చెందాడు. అయితే గత 20 రోజులుగా కొడుకు కనిపించకపోవడంతో చాదర్‌ఘాట్ పోలీసులకు ఈనెల 11న బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా పోలీసులు ఆచూకీ కనిపెట్టకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. అయితే.. ఆస్పత్రిలో 20 రోజుల క్రితమే మృతి చెందాడని తెలియడంతో కుటుంబ సభ్యులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుతో తన కొడుకు అనాథ శవంగా ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పడి ఉన్నాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 6న జరిగిన ప్రమాదంలో చనిపోయిందని శ్రవణ్ కుమారే అని పోలీసులు ఆలస్యంగా గుర్తించారు.