వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన "అల్పపీడనం"

Update: 2020-08-13 11:27 GMT
Heavy rains in AP (File Photo)

telangana weather report: ఉత్తర ఆంధ్ర మరియు ఒరిస్సా తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వలన ఉత్తర ఒరిస్సా మరియు పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతంలో ఈరోజు(ఆగస్టు 13 వ తేదీ) ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్- గ్రామీణ, మెహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాలలో ఈరోజు ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు అత్యంత భారీవర్షం కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News