Talasani: పీవీ సంస్కరణల వల్లే దేశం ఆర్థికంగా నిలదొక్కుకుంది

Talasani: ఇప్పటికైనా కేంద్రం పీవీకి భారతరత్న ఇవ్వాలి

Update: 2023-06-28 06:59 GMT

Talasani: పీవీ సంస్కరణల వల్లే దేశం ఆర్థికంగా నిలదొక్కుకుంది

Talasani: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌లో పలువురు రాజకీయ నేతలు నివాళులర్పించారు. పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవను గుర్తుచేసుకున్నారు. పీవీ నరసింహారావు ఆనాడు సంస్కరణలు చేపట్టడం వల్లే దేశం ఆర్థికంగా నిలదొక్కుకుందన్నారు మంత్రి తలసాని. దేశంలో విప్లవాత్మక సంస్కరణలకు కారణమైన పీవీ పేరును.. ఇవాళ కనీసం పార్లమెంట్‌లో తలచుకోకపోవడం దౌర్భాగ్యమన్నారు. ఇప్పటికైనా కేంద్రం పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక పీవీ నరసింహారావు ఆశయాలను కొనసాగించడమే అసలైన నివాళి అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

Tags:    

Similar News