MLA Defection Case: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కొత్త ట్విస్టులు?
MLA Defection Case: ఆ ఐదుగురు ఎమ్మెల్యేల సంగతేంటి? ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కోంటున్న వారి మీద స్పీకర్ చర్యలు ఉంటాయా..?
MLA Defection Case: ఆ ఐదుగురు ఎమ్మెల్యేల సంగతేంటి? ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కోంటున్న వారి మీద స్పీకర్ చర్యలు ఉంటాయా..? లేక కొత్త కొత్త ట్విస్ట్‌లకు అవకాశాలున్నాయా..? ప్రత్యేకించి దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో స్సీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది..? BRS బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ గూటికి చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల ఎపిసోడ్ కొత్త మలుపులు తిరుగుతోంది.
పార్టీ ఫిరాయిపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. అనర్హత పిటిషన్స్‌పై విచారణ జరిపిన అసెంబ్లీ స్పీకర్.. ఐదుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు. వీరు పార్టీ మారినట్టు సరైన సాక్ష్యాలు లేవంటూ వాళ్లపై దాఖలైన పిటిషన్స్‌ను డిస్పోజ్ చేశారు. దీంతో ఇక మిగిలిన ఐదుగురి సంగతేంటనే చర్చ జరుగుతోంది. ఆ ఐదుగురు ఎమ్మెల్యేల మీద స్పీకర్ చర్యలు తీసుకుంటారా.. లేక కొత్త ట్విస్ట్‌లు ఏమైనా ఉంటాయా..? ప్రత్యేకించి దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే స్పీకర్ నోటీస్‌కు ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదు. బీఆర్‌ఎస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. రాజీనామా చేయకుండానే, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ మారలేదని, కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనలేదంటూ మిగతా ఎమ్మెల్యేలు చెప్పిన వివరణను పరిగణలోకి తీసుకున్న స్పీకర్, దానం నాగేందర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు, ఫిరాయింపు ఎమ్మెల్యేల వివాదం నడుస్తున్న వేళ దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియదన్నారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని దానం చెప్పారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. జనవరిలో విచారణ ఉన్న క్రమంలో అప్పటి వరకు వేచి చూస్తారా.. లేదంటే అంతకంటే ముందే స్పీకర్ నిర్ణయం వెల్లడిస్తారా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.