KPHB Police Raid: స్పా ముసుగులో వ్యభిచారం.. 30 మంది యువతుల అరెస్ట్‌

KPHB Police Raid: హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ కాలనీలో మసాజ్ సెంటర్ల పేరుతో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

Update: 2026-02-14 06:35 GMT

KPHB Police Raid: నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో మసాజ్ సెంటర్ల పేరుతో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కేపీహెచ్‌బీ ఫేజ్-6 లోని 'ఆవాస స్పా' (Avasa Spa) లో నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ఈ మెరుపు దాడుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 15 మంది యువతులతో పాటు, పలువురు విటులు మరియు నిర్వాహకులను కలిపి మొత్తం 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సాధారణ మసాజ్ పేరుతో అనుమతులు పొంది, లోపల క్రాస్ మసాజ్ మరియు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్పా సెంటర్ ఇద్దరు నిర్వాహకులను పట్టుకున్న పోలీసులు, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ఇటువంటి కేంద్రాలపై నిరంతరం నిఘా ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కేపీహెచ్‌బీ పోలీసులు హెచ్చరించారు.

Tags:    

Similar News