Kothagudem: కొత్తగూడెం కార్పొరేషన్‌పై పొలిటికల్ హీట్
Kothagudem Corporation Mayor Seat Suspense: కొత్తగూడెం కార్పొరేషన్‌పై పొలిటికల్ హీట్ నెలకొంది.
Kothagudem Corporation Mayor Seat Suspense: కొత్తగూడెం కార్పొరేషన్‌పై పొలిటికల్ హీట్ నెలకొంది. కాసేపట్లో సీపీఐ ముఖ్యనేతలు జూమ్ మీటింగ్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ భేటీలో కొత్తగూడెం కార్పొరేషన్‌పై చర్చించనున్నారు. కొత్తగూడెంలో మొత్తం డివిజన్లు 60 కాగా.. కాంగ్రెస్-22, సీపీఐ-22, బీఆర్‌ఎస్-8, ఇతరులు-6, బీజేపీ-1, సీపీఎం ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. అయితే.. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో.. మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, సీపీఐ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
మరోవైపు.. కొత్తగూడెం మేయర్ విషయంలో ఏ పార్టీ మద్దతు తీసుకోవాలనేదానిపై సీపీఐ తర్జన భర్జన పడుతోంది. ఇప్పటికే క్యాథన్‌పల్లి మున్సిపాలిటీలో సీపీఐ, బీఆర్‌ఎస్ పొత్తు విజయం సాధించింది. ఈ క్రమంలోనే సీపీఐకి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది బీఆర్‌ఎస్. సింగరేణిపై పోరాటానికి కలిసి వస్తే సీపీఐకి మద్దతిస్తామంది. దీంతో.. సీపీఐ నేతల జూమ్ మీటింగ్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీ తర్వాత పొత్తుల విషయంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.