Karimnagar: ప్రతి వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సభ
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లలో ఏప్రిల్ 2న 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' వార్డు సభలను నిర్వహించనున్నారు.
Karimnagar: ప్రతి వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సభ
కరీంనగర్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఏప్రిల్ 2 న నగర వ్యాప్తంగా వార్డు ( డివిజన్) సభలను విజయవంతంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీస్కోవాలని నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, సానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వార్డు సభ నిర్వహణకు చేపట్టాల్సిన ప్రణాళిక, చేయాల్సిన ఏర్పాట్లు, జన సమీకరణ, ముఖ్య అతిథుల ఆహ్వానం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వార్డు సభల నిర్వహణ పై పలు సూచనలు చేస్తూ. ఆదేశాలు జారీ చేశారు. వార్డు సభల నిర్వహణకు నగరపాలక సంస్థ నుండి ఇంచార్జ్ అధికారులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వార్డు సభలను విజయవంతం చేయాలి:
కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ ప్రజా పాలన. ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఏప్రిల్ 2 న వార్డు సభలు ప్రశాంత వాతావరణంలో పెద్ద ఎత్తున నిర్వహించి విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నగర వ్యాప్తంగా 66 జివిజన్ల లో కార్పోరేటర్ల సహకారం సమన్వయంతో వార్డు సభలు ఏర్పాటు కు చర్యలు తీస్కోవాలన్నారు. అవసరమైన చోట టెంట్లు, చైర్లు, త్రాగు నీరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉదయం 10 గంటలకు వార్డు సభలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి..
డివిజన్ల వారిగా పాలకవర్గ సభ్యుల సహకారంతో వార్డు ఆఫీసర్లు, ఇంచార్జ్ లు సభలు నిర్వహించాలని, ఎవరైన ముఖ్య అతిథులు ఉంటే వారిని ఆహ్వానించాలన్నారు. డివిజన్ల వారిగా వార్డు సభలకు ప్రజలు హాజరయ్యేలా చర్యలు తీస్కోవాలని ఆదేశించారు. సభలో ప్రజా ప్రతినిధులు, మెప్మా మహిళ సంఘాల సభ్యులు, వివిధ స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువకులు, అంగన్వాడీ, ఆశ వర్కర్ ల తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలన్నారు. ముఖ్యంగా వార్డు సభలకు విద్యుత్, విద్యా, వైద్యం, రెవెన్యూ తదితర శాఖల నుండి అధికారులు హాజరయ్యేలా చూడాలన్నారు.
వార్డు సభల అజెండాను ప్రజలకు తెలియజేసేలా చర్యలు..
ప్రభుత్వం చేపట్టిన వివిధసంక్షేమ పథకాల పై ప్రజలతో చర్చించాలన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు లబ్ధిపొందిన లబ్ధిదారుల పేర్లను చదవేలా చర్యలు తీస్కోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతీ, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్, మహిళా శక్తి, రైతు బరోసా, మహిళా సంఘాల వడ్డీ రుణాలు తదితర పథకాలను సంబంధిత శాఖల అధికారుల నుండి వివరించేలా చర్యలు తీస్కోవాలన్నారు.
అంతే కాకుండా నగరపాలక సంస్థ ఆస్తి పన్నులు, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు కలెక్షన్ తదితర వివరాలను సభలో వివరించాలన్నారు. డివిజన్ల వారిగా చేపట్టిన అభివృద్ధి పనులు, చేయాల్సిన అభివృద్ధి పనులను కూడ వివరించాలని. వార్డు సభలో ప్రజల నుండి ఫిర్యాదుల, అభ్యంతరాలు స్వీకరించేలా చర్యలు తీస్కోవాలన్నారు. డివిజన్ల వారిగా ప్రజల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీస్కోవాలన్నారు.
నగరపాలక సంస్థ పరిదిలో 66 డివిజన్ల లో వార్డు సభలను విజయవంతం చేయాలన్నారు. సభల్లో ప్రజలను తప్పక బాగస్వాములను చేసి. సభలు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశం డిప్యూటీ కమీషనర్లు ఖాధర్ మొహియుద్దీన్, వేణు మాధవ్, ఎంహెచ్ ఓ, డీఈలు, ఏఈలు, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, సానిటేషన్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.