Kandarpally: రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోరు.. రేపే ప్రారంభం!
Kandarpally: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్పల్లిలో ఏప్రిల్ 2న రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు.
Kandarpally: రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోరు.. రేపే ప్రారంభం!
Kandarpally: కందర్పల్లి (కామారెడ్డి) బిచ్కుంద మండలం కందర్పల్లి లో ఈ నేల 2 న రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చౌహన్.వినోద్ ఓ ప్రకటనలోతెలిపారు. ఈ పోటీలో పాల్గొనే వారు 20 సంవత్సరాల లోపు బాలురు, బాలికల ఫ్రీ స్టైల్ బాలురకు గ్రీకో రోమన్ స్టైల్ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పోటీలో పాల్గొనే వారు ఉదయం 9 గంటలకు కందర్పల్లి గ్రామంలోని రెజ్లింగ్ పోటి స్థలానికి చేరుకోవాలని ఆయన సూచించారు. పోటీలను ప్రారంభించేందుకు బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్. ఎ. కిరణ్మయి ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించనున్నట్లు పోటి నిర్వాహకులు తెలిపారు.
ఇందులో పాల్గొని గెలుపొందిన వారు ఈ నేల 9.10.11 తేదీలలో మూడు రోజుల పాటు ఛత్తీస్ ఘడ్ లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు అర్హులని అన్నారు. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో అసోసియేషన్ కార్యదర్శి పవన్ కుమార్, సంయుక్త కార్యదర్శి దానయ్య, ట్రెజర్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు.