Peddapalli: చేతికొచ్చే వేళ తీరని నష్టం..అన్నదాతను ఆదుకోవాలి

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో అకాల వర్షాలు, గాలులకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరిశీలించారు.

Update: 2026-04-01 09:42 GMT

Peddapalli: చేతికొచ్చే వేళ తీరని నష్టం..అన్నదాతను ఆదుకోవాలి

Peddapalli: ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు అన్నదాతను నిలువునా ముంచాయి.పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల (జగ్గయపల్లి) గ్రామాల్లో మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మండల బిఆర్ఎస్ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​పంట పొలాలను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరుకాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నేలకొరగడంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 40 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తుచేశారు.

​ఈ కార్యక్రమంలో మల్యాల గ్రామ సర్పంచ్ భూస సదాశివారెడ్డి, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ జూకంటి శిరీష ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News