Kamareddy: నష్టాల్లో చికెన్ వ్యాపారం.. వ్యాపారుల నిరసన!
Kamareddy: రాష్ట్రవ్యాప్త బంద్‌లో భాగంగా కామారెడ్డి పట్టణంలో చికెన్ సెంటర్ల వ్యాపారులు బుధవారం నిరసన చేపట్టారు.
Kamareddy: నష్టాల్లో చికెన్ వ్యాపారం.. వ్యాపారుల నిరసన!
Kamareddy: రాష్ట్రవ్యాప్తంగా చికెన్ సెంటర్లు బంద్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలో చికెన్ సెంటర్ వ్యాపారులు బుధవారం నిరసన తెలిపారు. చికెన్ వ్యాపారులకు, చికెన్ సప్లై కంపెనీలకు మధ్య తేడాతో నష్టాల్లో చికెన్ సెంటర్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చికెన్ కంపెనీ ట్రెండింగ్ వ్యాపారులతో ఇబ్బందిగా మారిందని చికెన్ సెంటర్ వ్యాపారులు ఇప్పటికే కొన్ని చోట్ల నష్టాలతో దుకాణాలు మూసేశారని,చికెన్ సెంటర్లు యూనియన్ అధ్యక్షుడు మహమ్మద్ ఎజాస్ తెలిపారు . గతంలో ఇచ్చిన విధంగానే కమిషన్ ఇవ్వాలని వినియోదారులకు కూడా తమ నష్టం చేయబోమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చికెన్ సెంటర్ వ్యాపారులు ఎండి నిజాముద్దీన్, కుర్రమ్, మహమ్మద్ ముసాయిద్ ఖాన్, ఫస్యుద్దిన్, చాట్ల శ్రీను, కిషన్ తదితరులు పాల్గొన్నారు.