Gummiryala: గ్రామాల్లోకి ఐస్‌క్రీమ్ బండ్లు రావద్దు.. వస్తే ₹5000 జరిమానా!
Gummiryala: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఐస్‌క్రీమ్ బండ్ల ప్రవేశాన్ని నిషేధిస్తూ గ్రామస్తులు, వీడీసీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Gummiryala: గ్రామాల్లోకి ఐస్‌క్రీమ్ బండ్లు రావద్దు.. వస్తే ₹5000 జరిమానా!
Gummiryala: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని గుమ్మిరియాల, అంక్సాపూర్, వేంపల్లి గ్రామాల్లో ఐస్ క్రీమ్ బండ్లు గ్రామంలోకి రా వద్దని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు గ్రామస్తులు. నాసిరకం నాణ్యత మరియు గడువు లేని ఐస్క్రీమ్ లను విచ్చలవిడిగా గ్రామాల్లో అమ్ముకొని డబ్బు సంపాదిస్తూ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని ఉద్దేశంతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఐస్ క్రీమ్లు చల్లగా తీయగా ఉండడం వెనక ప్రమాదం దాగి ఉందని పిల్లలు వాటికి అలవాటు పడి నాణ్యతలేని గడువులేని ఐస్క్రీమ్ తినడంతో ఆరోగ్యం పాడవుతుందని పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు ప్రతి తల్లిదండ్రులు పిల్లలను నాణ్యత లేని ఐస్ క్రీమ్లు తినకుండా జాగ్రత్త పడాలని తెలిపారు మరియు ఐస్ క్రీమ్ తయారు చేసే గోదాం వద్దకు అధికారులు వెళ్లి నమూనాలు సేకరించి నాణ్యత లేని ఐస్ క్రీమ్ కంపెనీలపై తగు చర్యలు చేపట్టాలని అధికారులను గ్రామస్తులు కోరారు.