Tandur: ఐస్ క్రీమ్ ప్రియులు జాగ్రత్త.. బయటపడ్డ కల్తీ కేంద్రాలు!
Tandur: వికారాబాద్ జిల్లా తాండూరులో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.
Tandur: ఐస్ క్రీమ్ ప్రియులు జాగ్రత్త.. బయటపడ్డ కల్తీ కేంద్రాలు!
Tandur: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ నిబంధనలకు విరుద్ధంగా కల్తీ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న కేంద్రాలపై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు విరుచుకుపడ్డారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ అన్వార్ పాషా బృందం పట్టణంలోని పలు తయారీ యూనిట్లపై ఆకస్మిక దాడులు నిర్వహించింది.
ఈ దాడుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్న తయారీ కేంద్రాలను గుర్తించారు. నిందితులు మహ్మద్ అఫ్సర్, డి. శ్రీనివాస్ ఐస్ క్రీమ్ తయారీలో నిషేధిత పారిశ్రామిక రంగులు గడువు ముగిసిన ముడి సరుకులను వాడుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. భారీగా నిల్వ ఉంచిన కల్తీ సామగ్రిని స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసులు నమోదు చేశారు.