Kavitha: మూసీకి రూ. 7వేల కోట్లు.. మరి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్లేవా?

Kavitha: నిరుద్యోగులను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు.

Update: 2026-04-01 07:21 GMT

Kavitha: మూసీకి రూ. 7వేల కోట్లు.. మరి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్లేవా?

Kavitha: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నట్టేట ముంచిందని ఆమె విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతూ కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల ఆశలను తొక్కుకుంటూ రేవంత్ రెడ్డి సీఎం పీఠాన్ని అధిష్టించారని ఆరోపించారు.

మూసీ నది ప్రక్షాళనకు రూ. 7,000 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వానికి మనసు వస్తుంది కానీ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేందుకు నిధులు లేవా? అని ప్రశ్నించారు.

మూసీపై రివ్యూలు చేసేందుకు సీఎంకు సమయం ఉంటుంది కానీ, నిరుద్యోగుల సమస్యలపై చర్చించేందుకు తీరిక లేదా అని నిలదీశారు.

జీవో 4 రద్దుకు డిమాండ్

ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ల నియామకాల్లో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఇంటర్వ్యూ పద్ధతిని కవిత తీవ్రంగా వ్యతిరేకించారు. గత 15 ఏళ్లుగా డిగ్రీ లెక్చరర్ల నోటిఫికేషన్లు లేవని, ఇప్పుడు ఇంటర్వ్యూలు పెట్టడం అంటే తమ అనుయాయులకు ఉద్యోగాలు ఇచ్చుకోవడమేనని విమర్శించారు. తక్షణమే జీవో 4 (GO 4) ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ వచ్చినా ఏదో ఒక జీవో అడ్డంకిగా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోరాటం తప్పదు

గత ప్రభుత్వ హయాంలో సమస్యలు ఉన్నాయని చెబుతున్న వారు, ఇప్పుడు అధికారంలో ఉండి ఏం చేస్తున్నారని కవిత ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మెడలు వంచేలా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు.

Tags:    

Similar News