Balkonda: బాల్కొండలో అద్భుతం అయ్యప్ప స్వామి నుదుటిపై సూర్య తిలకం!
Balkonda: నిజామాబాద్ జిల్లా బాల్కొండలో అయ్యప్ప జయంతి వేళ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
Balkonda: బాల్కొండలో అద్భుతం అయ్యప్ప స్వామి నుదుటిపై సూర్య తిలకం!
Balkonda: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ఒక అరుదైన, ఆధ్యాత్మిక అద్భుతం చోటుచేసుకుంది. అయ్యప్ప జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తుండగా, సూర్య కిరణాలు నేరుగా స్వామివారి నుదుటిపై ప్రసరించాయి.
సరిగ్గా పూజా సమయంలో సూర్య భగవానుడి కిరణాలు గర్భాలయంలోని అయ్యప్ప స్వామి విగ్రహంపై సోకి, నుదుటి భాగంలో తిలకం దిద్దినట్లుగా కనిపించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు భక్తిపారవశ్యంతో "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ నినాదాలు చేశారు. జయంతి రోజే స్వామివారికి ఈ విధంగా 'సూర్య తిలకం' రావడం శుభసూచకమని అర్చకులు మరియు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.