Saleshwaram Jatara 2026: తెలంగాణ అమర్‌నాథ్ యాత్ర సలేశ్వరం జాతర ప్రారంభం
Saleshwaram Jatara 2026: తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది.
Saleshwaram Jatara 2026: సలేశ్వరం జాతార అధ్యంతం పర్యాటకుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. చెట్లపై పక్షుల కిలకిల రావాలు.. కొండల మధ్యలో నుంచి జాలువారే జలపాతాలు, దాట్టమైన అడవిలో కనిపించే అటవీ జంతువులు కనువిందు చేస్తూ భక్తులను మరింతగా పరవశింపజేస్తాయి. ఎత్తైన కొండల నడుమ వెయ్యడుగుల లోయలో కొలువైన పురాతన దేవాలయమే ఈ సలేశ్వర క్షేత్రం.
తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా ప్రసిద్ధి పొందిన సలేశ్వర జాతర ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు జరగనుంది. ఈ సలేశ్వర లింగమయ్య దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం ఫర్హాబాద్ నుంచి పుల్లయపల్లి, రాంపూర్ చెంచు పెంటల మీదుగా సుమారుగా 20 కిలో మీటర్లు వాహనాల్లో ప్రయాణం సాగించాలి. అక్కడ నుంచి కొండలు, రాళ్లను దాటుకుంటూ 4 కిలో మీటర్లు నడిచి వెళ్తే సలేశ్వర క్షేత్రానికి చేరుకోవచ్చు.
సలేశ్వర క్షేత్రానికి ఎదరుగా ఉన్న ఎత్తైన కొండపై నుంచి జాలువారే జలపాతాలు భక్తులను ఆకట్టుకుంటాయి. పురాతన కాలం లింగమయ్య ఆలయంలో పూజలన్నీ అనాదిగా చెంచు పెద్దలే నిర్వహిస్తారు. సలేశ్వర క్షేత్రానికి ఎదరుగా ఉన్న ఎత్తైన కొండపై నుంచి జాలువారే జలపాతాలు భక్తులను ఆకట్టుకుంటాయి. సలేశ్వరం యాత్ర ఎక్కువగా అటవీ ప్రాంతం నుంచే ప్రయాణం చేయాల్సిన నేపథ్యంలో.. అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.