Kavitha: సీపీఐ కాళ్లు పట్టుకోవడం సిగ్గుచేటు: కేటీఆర్ టార్గెట్‌గా ఎమ్మెల్సీ కవిత బాంబులు

Kavitha: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

Update: 2026-02-14 07:12 GMT

Kavitha: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఈ ఫలితాలపై కవిత స్పందిస్తూ బీఆర్ఎస్ వైఖరిని, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనపడటం, బీజేపీతో పొత్తు దిశగా అడుగులు వేయడంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

కవిత వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు:

మున్సిపల్ ఫలితాలతో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు తొలి అడుగు పడిందని కవిత వ్యాఖ్యానించారు. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పట్టు కోల్పోయిందని, రానున్న రోజుల్లో బీజేపీతో కలవక తప్పని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

"నాడు కమ్యూనిస్టులను తోక పార్టీలన్న బీఆర్ఎస్.. ఇప్పుడు వారికే తోక పార్టీగా మారింది. కొత్తగూడెంలో సీపీఐ అడగకుండానే కేటీఆర్ మద్దతు ప్రకటించడం దిగజారుడు రాజకీయం" అని మండిపడ్డారు. కాళేశ్వరంపై సీపీఐ నేత కూనంనేని చేసిన ఆరోపణలను కేటీఆర్ ఇప్పుడు అంగీకరించినట్లేనా అని ప్రశ్నించారు.

 "ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది" అంటూ జాగృతి బలాన్ని చాటారు. సింగరేణి ఎన్నికల్లో సైతం జాగృతి, AIFB కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. 40కి పైగా స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

"నేనే రాజు.. నేనే మంత్రి" అని విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి, తన పదవి బోనస్ గురించి కాకుండా రైతుల బోనస్ గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News