Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డి,కేసీఆర్ మాటల యుద్దంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ మాటల యుద్ధంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డి,కేసీఆర్ మాటల యుద్దంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ మాటల యుద్ధంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో అభివృద్ధి మాట వినిపించడం లేదని.. మండిపడ్డారు. సీఎం అధికారంలో ఉన్నవారు.. అధికారం కోసం ఆరాటపడేవారు అసభ్య పదజాలంతో దూషించుకుంటున్నారని విమర్శించారు. నాయకులు తిట్టుకుంటుంన్నారంటే.. పాలనలో వారు విఫలమైనట్టేనన్నారు.
సంస్కారం గురించి క్లాసులు చెప్పే పార్టీలు.. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉండి అసభ్యంగా మాట్లాడుతున్నాయని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కంటే.. ప్రతిపక్షాల మధ్య తిట్ల పురాణమే ఎక్కువగా వినిపిస్తోందన్నారు. అభివృద్ధిపై చర్చను పక్కనపెట్టి గొడవలతో కాలక్షేపం చేయటం దురదృష్టకరమన్నారు.