Harish Rao: సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి సీఎంగా ఉంటే.. రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందేనా?

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డిపై ఎక్స్ వేదికగా మాజీమంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు.

Update: 2025-12-26 10:37 GMT

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డిపై ఎక్స్ వేదికగా మాజీమంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి సీఎంగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందేనా అని అడిగారు. అందరినీ తొక్కుకుంటూ వచ్చాను అని గర్వంగా చెప్పుకునే రేవంత్ పాలనలో ఇప్పుడు రైతులను తొక్కుతున్నారన్నారు. చిల్లర రాజకీయాలకు విధ్వంకర పాలనకు రైతు బలైపోతున్నాడని ఆవేదన చెందారు.

యూరియా కొరత కనిపించకుండా మారేడుకాయ చేయడానికి తెచ్చిన యూరియా యాప్ ఏమైందని ప్రశ్నించారు. మీరు ప్యాలెస్‌లో కూర్చుంటే, రైతులు మాత్రం తెల్లావారుజాము నుంచే ఎముకలు కొరికే చలిలో చెప్పులు క్యూలో పెట్టుకుని యూరియా ఎదురు చూస్తున్నారన్నారు. ఇదేనా మీరు చెప్పిన మార్పు అని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం తెలంగాణలో యూరియా సమస్య తీరదా అని ఎక్స్ వేదికగా హరీష్‌రావు ప్రశ్నించారు.

Tags:    

Similar News