Hyderabad: ఏసీలో మంటలు.. రెండేళ్ల చిన్నారి మృతి
Hyderabad: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలో మంటలు చెలరేగి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్ కాచిగూడలో చోటుచేసుకుంది.
Hyderabad: ఏసీలో మంటలు.. రెండేళ్ల చిన్నారి మృతి
Hyderabad: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలో మంటలు చెలరేగి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్ కాచిగూడలో చోటుచేసుకుంది. కాచిగూడ సుందర్‌నగర్‌లోని ఓ నివాసంలో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా ఏసీ యూనిట్‌లో మంటలు రావడంతో ఇంట్లో కలకలం రేగింది.
ప్రమాద సమయంలో గదిలో ఉన్న రెండేళ్ల బాలుడు మంటలకు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.