Mahabubabad: మహబూబాబాద్‌లో ఘోరం: నిద్రిస్తున్న అత్త మెడకు వైరు చుట్టి.. కరెంట్‌ షాకిచ్చి చంపిన అల్లుడు!

Horrific Murder in Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలంలో ఒళ్లు గగుర్పొడిచే ఘాతుకం చోటుచేసుకుంది.

Update: 2026-02-10 06:54 GMT

Horrific Murder in Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలంలో ఒళ్లు గగుర్పొడిచే ఘాతుకం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఊగిపోయిన ఓ అల్లుడు.. కన్నతల్లిలా చూడాల్సిన అత్తను విద్యుత్ షాక్ ఇచ్చి అత్యంత పాశవికంగా హతమార్చాడు. సీతంపేట శివారు మంగళతండాలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన వెలుగుచూసింది.

ఘటనకు దారితీసిన కారణాలు

కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. నిందితుడు రాజేష్ సోదరుడు రమేష్‌కు మూడు రోజుల క్రితమే అంజలి అనే మహిళతో రెండో వివాహం జరిగింది. ఈ పెళ్లి విషయంపై రాజేష్ అసంతృప్తితో ఉన్నాడు. సోమవారం రాత్రి మద్యం సేవించిన రాజేష్, సోదరుడి రెండో వివాహంపై కుటుంబ సభ్యులతో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగాడు.

అర్ధరాత్రి మృత్యుపాశం

గొడవ సద్దుమణిగి అందరూ నిద్రిస్తున్న సమయంలో రాజేష్ తన కిరాతకాన్ని ప్రదర్శించాడు. నిద్రిస్తున్న అత్త కంసాలి (48) మెడకు విద్యుత్ వైరు చుట్టి, కరెంట్ షాక్ ఇచ్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అంతటితో ఆగని నిందితుడు.. సోదరుడి భార్య అంజలిపై కత్తితో దాడి చేశాడు. తన భార్య, తల్లిదండ్రులను కూడా హతమార్చేందుకు ప్రయత్నించగా, వారు అప్రమత్తమై ప్రాణాలతో తప్పించుకున్నారు.

సమాచారం అందుకున్న గార్ల పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. కంసాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News