Tandur: నీటి సరఫరాకు బ్రేక్.. ఏప్రిల్ 7 వరకు చుక్క నీరు రాదు
Tandur: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ ప్రజలకు మిషన్ భగీరథ అధికారులు కీలక ప్రకటన చేశారు.
Tandur: నీటి సరఫరాకు బ్రేక్.. ఏప్రిల్ 7 వరకు చుక్క నీరు రాదు
Tandur: వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. శనివారం నుంచి వచ్చే నెల 7వ తేది వరకు సుమారు 11 రోజుల పాటు నీటి సరఫరా జరగబోదని మిషన్ భగీరథ అధికారులు ప్రకటించారు. యెల్లోర్ సెగ్మెంట్ పరిధిలోని పంపులకు అత్యవసర మరమ్మతులు మరియు నిర్వహణ పనులు చేపట్టిన కారణంగా, నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని వివరించారు.
తాండూరు మున్సిపాలిటీ పరిధితో పాటు తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల, మరియు ధారూర్ మండలాల్లోని అన్ని గ్రామాలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని చెప్పారు. నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని, వృథా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అవసరాల కోసం ఆయా గ్రామాలు/ప్రాంతాలలో అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ నీటి వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు.