మక్తల్‌లో విషాదం: పోలింగ్‌కు ముందు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. ప్రత్యర్థుల బెదిరింపులే కారణమా?

BJP Candidate: నారాయణపేట జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీలో షాకింగ్‌ ఘటన జరిగింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు విషాదం చోటు చేసుకుంది.

Update: 2026-02-10 05:53 GMT

BJP Candidate: నారాయణపేట జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీలో షాకింగ్‌ ఘటన జరిగింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు విషాదం చోటు చేసుకుంది. మక్తల్ మున్సిపాలిటీలో 6 వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నామినేష్ వేసినప్పటి నుంచి మహాదేవ్‌ను ప్రత్యర్థులు భయబ్రాంతులకు గురి చేస్తుశారని కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. వారి వేధింపులు భరించలేక ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఫిబ్రవరి 11న పోలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 9, సోమవారంతో ప్రచారం ముగిసింది. అయితే చివరి రోజు సోమవారం ఎంపీ డీకే అరుణతో ప్రచారంలో పాల్గొన్న మహదేవ్.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ముందు నుంచే మహదేవ్‌పై ఒత్తిళ్లు ఉన్నాయని కుటుంబసభ్యులు తెలిపారు. రేపు ఎలక్షన్‌ ఉండడంతో కొందరు బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ప్రత్యర్థి అభ్యర్థుల బెదిరింపుల వల్లే ఇతను సూసైడ్‌ చేసుకున్నారా.. వేరే కారణం ఉందా అనే దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

Full View


Tags:    

Similar News