జగ్గారెడ్డి వర్సెస్ పోలీసులు: ఎలక్షన్ కోడ్ వేళ నగదు పంపిణీ.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై కేసు?

Jagga Reddy: సదాశివపేట చాంద్ భాయ్ హోటల్ దగ్గర పేదలకు, వృద్ధులకు.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డబ్బులు పంచుతుంటుండగా అక్కడికి వచ్చిన పోలీసులు ఎలక్షన్ కోడ్ ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

Update: 2026-02-10 07:30 GMT

Jagga Reddy: సదాశివపేట చాంద్ భాయ్ హోటల్ దగ్గర పేదలకు, వృద్ధులకు.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డబ్బులు పంచుతుంటుండగా అక్కడికి వచ్చిన పోలీసులు ఎలక్షన్ కోడ్ ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇలా డబ్బులు పంచడం.. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుందని, డబ్బులు పంచొద్దని పోలీసులు జగ్గారెడ్డికి తెలిపారు. జగ్గారెడ్డి డబ్బులు పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో.. చాంద్ భాయ్ హోటల్ వద్దకు వచ్చిన పోలీసులు, జగ్గారెడ్డిని అక్కడి నుండి పంపించేశారు. అయితే, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

జగ్గారెడ్డి, సదాశివపేటకు వెళ్లినప్పుడల్లా చాంద్ భాయ్ హోటల్ వద్ద ఆగి, టీ తాగడం అలవాటని స్థానికులు చెబుతున్నారు. టీ తాగాడానికి ఆగిన సమయంలో తన వద్దకు వచ్చే పేదలకు, వృద్ధులకు జగ్గారెడ్డి డబ్బులు పంచుతుంటారట. ఈరోజు ఉదయం కూడా సదాశివపేట చాంద్ భాయ్ హోటల్ లో టీ తాగడానికి వచ్చిన జగ్గారెడ్డిని చూసి, కొందరు వృద్ధులు, పేదలకు ఆయన దగ్గరకు వచ్చారు. దీంతో వాళ్లకి జగ్గారెడ్డి డబ్బులు పంచారని తెలుస్తోంది.

Full View


Tags:    

Similar News