Suryapet: ఇంటి పిల్లర్లకు నీళ్లు కొడుతుండగా విద్యుత్ షాక్.. తండ్రి, కొడుకు మృతి..!
Suryapet: సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలో విషాదం చోటుచేసుకుంది.
Suryapet: సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఇల్లు నిర్మాణంలో భాగంగా పిల్లర్లకు నీళ్లు కొడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై తండ్రి, కొడుకు మృతి చెందారు. ట్రాక్టర్ ట్యాంకర్‌లోని మోటర్ వేసి, నీళ్లు కొడుతుండగా అకస్మాత్తుగా నీటితో పాటు విద్యుత్ సరఫరా కావడంతో తండ్రి బుచ్చయ్య, విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.
ఈ విషయాన్ని గమనించకుండా కుమారుడు లోకేష్ ట్యాంకర్‌ను తాకడంతో షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. కుటుంబికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా...అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.