CM Revanth Reddy: నేడు ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన

CM Revanth Reddy Delhi Visit: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు.

Update: 2025-12-26 06:14 GMT

CM Revanth Reddy Delhi Visit: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. శనివారం (డిసెంబర్ 27) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఈ పర్యటన రాష్ట్ర మరియు జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ సీడబ్ల్యూసీ సమావేశంలో పలు కీలక అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం చర్చించనుంది. ముఖ్యంగా.. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును 'విక్షిత్ భారత్ - జి రామ్ జి' (VB-G RAM G) గా మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. దీనిపై ఉమ్మడి పోరాట కార్యాచరణను ఖరారు చేయనున్నారు.

రానున్న ఐదు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) పేరుతో జరుగుతున్న ఓట్ల తొలగింపుపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణ వంటి అంశాలపై పార్టీ హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉంది. సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వంటి అగ్రనేతలు పాల్గొననున్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పాలనపై రేవంత్ రెడ్డి అధిష్టానానికి నివేదిక అందజేయనున్నారు.

Tags:    

Similar News