Rewind 2025: ఈ ఏడాది హైదరాబాద్ మెట్రోలో ఎన్నో మలుపులు

Rewind 2025: హైదరాబాద్ మెట్రో రోడ్ల మధ్యలో నుంచి పిల్లర్లతో దూసుకు వచ్చే రైలు.. గత ఐదేళ్లుగా కొత్త మెట్రో లైను రాకపోవడం ఈ ఏడాది వస్తుందని భావించిన వారికి నిరాశే ఎదురైంది.

Update: 2025-12-26 06:32 GMT

Rewind 2025: ఈ ఏడాది హైదరాబాద్ మెట్రోలో ఎన్నో మలుపులు

Rewind 2025: హైదరాబాద్ మెట్రో రోడ్ల మధ్యలో నుంచి పిల్లర్లతో దూసుకు వచ్చే రైలు.. గత ఐదేళ్లుగా కొత్త మెట్రో లైను రాకపోవడం ఈ ఏడాది వస్తుందని భావించిన వారికి నిరాశే ఎదురైంది.. డిపిఆర్లు కేంద్రానికి పంపించిన అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు.. మరోవైపు పిపిపి కాస్త ప్రభుత్వ పరం కావడం ఈ ఏడాది మరో ముఖ్య ఘట్టం.. 2025లో హైదరాబాద్ మెట్రో రైల్ జర్నీ సాగిన తీరు ఆసక్తికరం.

నగర రవాణా వ్యవస్థలో హైదరాబాద్ మెట్రోది చాలా కీలకపాత్ర. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో ప్రతిరోజు 5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. 2017లో మొదటి మెట్రో సర్వీస్ ప్రారంభం కాగా 2020 నాటికి పూర్తిగా 69 కిలోమీటర్ల మెట్రో హైదరాబాదులో అందుబాటులోకి వచ్చింది. అయితే అప్పటినుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే 2025 సంవత్సరంలో మెట్రో మూడు అడుగుల ముందుకి ఆరడుగులు వెనక్కు అన్న చందంగా మారింది.. 2025 లో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేస్ 2 కి సంబంధించి డిపిఆర్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. వాటిని కేంద్రానికి సైతం పంపించారు.

మెట్రో ఫేజ్-2 ను ఏ, బి గా విభజించారు. ఫేస్ ఏ లో నాగోల్ శంషాబాద్ మధ్య 36.8 కిలోమీటర్లు, రాయదుర్గ్ - కోకాపేట్ నియోపోలిస్ 11.6 కి.మీ, MGBS – చంద్రాయణగుట్ట 7.5 కి.మీ, మియాపూర్ - పటాన్చెరు మధ్య 13.4 కి.మీ, LB నగర్ - హయత్ నగర్ మధ్య 7.1 కి.మీ మేర అంటే మొత్తం 76.4 కి.మీ పొడవు మెట్రోకి గ్రీన్ సిగ్నల్ లభించింది. డిపిఆర్లు కూడా పూర్తయ్యాయి.. ఫేస్ 2 బి లో భాగంగా శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కి.మీ, జూబ్లీ బస్ స్టేషన్ నుండి మేడ్చల్ 24.5 కి.మీ, జేబీఎస్ నుంచి షామీర్‌పేట వరకు 22 కి.మీ అంటే మొత్తం 86. 1 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. ఈ రెండిటి కలిపి దాదాపుగా 53 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నట్లు డిపిఆర్లు పొందుపరిచారు. వీటిని కేంద్రానికి పంపించారు కానీ అక్కడ నుంచి ఈ ఏడాది ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో ఈ ఏడాది కూడా మెట్రోలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. అయితే ఓల్డ్ సిటీ కి సంబంధించిన మెట్రో ఆస్తుల సేకరణకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతుండడం సానుకూల అంశంగా చెప్పాల్సి ఉంటుంది.

ఈ ఏడాది మెట్రోలో మరో సంచలనం ప్రభుత్వమే హైదరాబాద్ మెట్రోని టేక్ అవర్ చేయడం.. ప్రతిసారి ఎల్ అండ్ టి అలగడం లేదా బెదిరించడం పట్ల ప్రభుత్వం సీరియస్ అయింది. మెట్రో నష్టాలను మేము భరించలేం తప్పుకుంటామన్న ఎల్ఎండ్ టీ తో స్వయంగా రేవంత్ మాట్లాడి తామే హైదరాబాద్ మెట్రోని తీసుకుంటామని స్పష్టం చేశారు.. మెట్రోని స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన లీగల్ పనులు వేగంగా సాగుతున్నాయి.. 2026 ఉగాది నాటికి ప్రభుత్వమే హైదరాబాద్ మెట్రోని పూర్తిగా టేక్ ఓవర్ చేసుకోబోతోంది .. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రానికి కూడా పంపించారు.

ఇక ఈ ఏడాది మరో సంచలనమే మెట్రోలో జరిగింది. గత 15 ఏళ్లుగా మెట్రో ఎండీ గా ఉన్న ఎన్వీఎస్ రెడ్డిని పక్కకు పెట్టి కొత్త ఎండిగా సర్ఫరాజ్ అహ్మద్ ను నియమించారు.. ఎన్‌వీఎస్ రెడ్డిని పట్టణ రవాణా శాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది హైదరాబాద్ మెట్రోలో పనులు ప్రారంభం అవుతాయని ఆశిస్తున్నారు నగరవాసులు.

Tags:    

Similar News