Medchal: మంటలతో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఓమ్ని వ్యాన్.. తప్పిన పెనుప్రమాదం
Medchal: మేడ్చల్ జిల్లా పోచారం పీఎస్ పరిధిలోని అన్నోజిగూడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Medchal: మేడ్చల్ జిల్లా పోచారం పీఎస్ పరిధిలోని అన్నోజిగూడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వస్తున్న ఓ మినీ వ్యాన్‌లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చేలరేగడంతో... ఒక్కసారిగా కంట్రోల్ తప్పి భారత్ పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. దీంతో వ్యాన్‌లో ఉన్నవారు వ్యాన్‌ను రోడ్డు పై నిలిపి బయటపడ్డారు.
వెంటనే అప్రమత్తమైన బంకు సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.