School Holidays: విద్యార్థులు ఆనందంతో ఎగిరిగంతేసే వార్త.. పెరిగిన సంక్రాంతి సెలవులు.. జాబితా ఇదే..!!
School Holidays: విద్యార్థులు ఆనందంతో ఎగిరిగంతేసే వార్త.. పెరిగిన సంక్రాంతి సెలవులు.. జాబితా ఇదే..!!
School Holidays: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు సర్కార్ తీపి కబురు అందించింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలకు భారీగా సెలవులను ప్రకటించింది. దీంతో విద్యార్థులు చదువుతో పాటు పండుగ ఆనందాలను కూడా పూర్తిగా ఆస్వాదించే అవకాశం దక్కింది. తాజా నిర్ణయం ప్రకారం.. సంక్రాంతి సెలవులు జనవరి 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. జనవరి 18వ తేదీ ఆదివారం నాటికి సెలవులు ముగుస్తాయి. పాఠశాలలు జనవరి 19వ తేదీ సోమవారం నుంచి తిరిగి తెరచుకుంటాయి.
గతేడాది సంక్రాంతికి కేవలం 6 రోజులు మాత్రమే సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. ఈ సారి శని, ఆదివారాలు వరుసగా రావడంతో సెలవుల సంఖ్య 9 రోజులకు పెరిగింది. ఈ అదనపు రోజులు విద్యార్థులకు భారీ ఊరటగా మారాయి. గ్రామాల్లో పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలనుకునే పిల్లలకు ఇది మంచి అవకాశమని చెప్పాలి. పల్లెల్లో సంక్రాంతి వాతావరణం ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి.. చాలా మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామాలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు.
సంక్రాంతి సెలవులతో పాటు జనవరి నెలలో కొన్ని ముఖ్యమైన సెలవులు కూడా ఉన్నాయి. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది. అలాగే జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సెలవు ప్రకటించారు. దీనికి తోడు ప్రతి వారం వచ్చే ఆదివారాలు కలిపితే.. జనవరి నెలలో సగానికి మించిన రోజులు విద్యార్థులకు సెలవులుగానే ఉండనున్నాయి.
వరుస సెలవులు రావడంతో రోడ్లు, బస్సులు, రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అదనపు బస్సులు, రైళ్ల ఏర్పాటుపై ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలానే దీర్ఘకాల సెలవులు ఉండటంతో రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణాలు మరింత పెరగనున్నాయి.
అయితే సెలవులు ఎక్కువగా ఉన్నాయని విద్యార్థులు పూర్తిగా ఆటలకే పరిమితం కాకుండా.. కొంత సమయం చదువుకూ కేటాయించాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. అలాగే గాలిపటాలు ఎగురవేసేటప్పుడు భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని.. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని పెద్దలు హెచ్చరిస్తున్నారు. ఈ దీర్ఘ సెలవులు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇద్దరికీ కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకునే మంచి అవకాశంగా మారాయి.