Talasani Srinivas Yadav: రేవంత్ ఉన్నది గింత.. పిసుకుతే ప్రాణం పోతది
Talasani Srinivas Yadav: నేను చిన్నప్పటి నుండి బొట్టుపెట్టుకుంటా..మీరేంది నేర్పిచ్చేది
Talasani Srinivas Yadav: రేవంత్ ఉన్నది గింత.. పిసుకుతే ప్రాణం పోతది
Talasani Srinivas Yadav: కాంగ్రెస్, బీజేపీ నేతలపై మంత్రి తలసాని హాట్ కామెంట్స్ చేశారు. టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని తలసాని సీరియస్ అయ్యారు. రేవంత్ ఉన్నది గింత..పిసికితే ప్రాణం పోతదన్నారు తలసాని. మరోవైపు బీజేపీ పైనా విమర‌్శనాస్త్రాలు సంధించారు తలసాని.. నాడు సెక్రటేరియట్ మారుస్తామంటే కోర్టు మెట్లెక్కినోళ్లు...నేడు నూతన సెక్రటేరియట్‌కు వస్తామంటున్నారని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్యలో చిచ్చుపెట్టడం సరికాదన్నారు.
అందరూ అంబేద్కర్ పేరు చెప్పుకుని ఓట్లు దండుకుంటున్నారని.. కేవలం తెలంగాణ సర్కార్ మాత్రమే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తోందన్నారు. అందులో భాగంగానే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం తో పాటు.. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక ఎన్నికల వేళ కొత్త బిచ్చగాళ్లు వస్తారని.. ప్రజలందరూ గ్రహించాలన్నారు తలసాని.