ఈడీ కస్టడీకి MBS జ్యువెలర్స్ అధినేత సుఖేష్ గుప్తా

Sukesh Guptha: 150 కోట్ల బంగారు ఆభరణాలు, రూ.2 కోట్ల నగదు సీజ్ చేసిన ఈడీ

Update: 2022-10-25 06:33 GMT

ఈడీ కస్టడీకి MBS జ్యువెలర్స్ అధినేత సుఖేష్ గుప్తా

Sukesh Guptha: MBS జ్యువెలర్స్ అధినేత సుఖేష్ గుప్తాను కాసేపట్లో ఈడీ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. 9 రోజుల పాటు కస్టడీకి అధికారులు అనుమతి కోరగా.. అందుకు ఈడీ కోర్ట్ అంగీకారం తెలిపింది. నవంబర్ 2 వరకు సుఖేష్ గుప్తాను ఈడీ ప్రశ్నించనుంది. గతంలో రెండు రోజుల పాటు సోదాలు చేసిన ఈడీ అధికారులు..150 కోట్ల బంగారు ఆభరణాలు, 2 కోట్ల నగదు సీజ్ చేశారు. MMTCని సుఖేష్ గుప్తా 504 కోట్ల మేరకు భారీ మోసం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. MMTC సంస్థ నుంచి కొనుగోలు చేసిన బంగారం అమ్మకాలు జరపగా.. వచ్చిన డబ్బులు ఎక్కడికి తరలించారని ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు. ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల ఎగవేతపైనా ఈడీ సుఖేష్ గుప్తాను ప్రశ్నించనుంది. ప్రస్తుతం చంచల్‎గూడ జైల్లో ఉన్న సుఖేష్ గుప్తాను కాసేపట్లో ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 

Tags:    

Similar News