Hyderabad: హిమాయత్‌నగర్‌లో కుంగిన రోడ్డు...
Hyderabad: హైదరాబాద్ నగరంలో మరోసారి రోడ్డు కుంగిపోయింది.
Hyderabad: హిమాయత్‌నగర్‌లో కుంగిన రోడ్డు...
Hyderabad: హైదరాబాద్ నగరంలో మరోసారి రోడ్డు కుంగిపోయింది. గోశామహల్ చక్నవాడి ఘటన మరువకముందే.. హిమాయత్‌నగర్‌లో రోడ్డు కుంగింది. స్ట్రీట్ నంబర్ 5 లో రోడ్డుపై 10 అడుగుల మేర గుంత ఏర్పడింది. అయితే.. ఈ గుంతలో మట్టి లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. కుంగిన రోడ్డు పక్కనే నాలా ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న స్థానిక కార్పొరేటర్.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మరోవైపు టిప్పర్‌ను తొలగించే చర్యలు కొనసాగుతున్నాయి.