Narsapur: గర్భిణీలకు సీమంతాలు.. అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

Narsapur: నర్సాపూర్ నియోజకవర్గం ఆవంచ గ్రామంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి 'పోషణ పక్వాడ' కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Update: 2026-04-10 14:30 GMT

Narsapur: గర్భిణీలకు సీమంతాలు.. అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

Narsapur: నర్సాపూర్ మండల పరిధిలోని ఆవంచ గ్రామంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై పోషణ పక్వాడ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా పోషణ పక్వాడ కార్యక్రమం నూ అంగన్వాడి టీచర్లు ప్రతి గ్రామంలో 15 రోజుల పాటు నిర్వహించి గ్రామ ప్రజలకు ఆరోగ్యం పై చైతన్యం కలిగించాలని తెలియజేశారు.

మహిళలు తీసుకోవాల్సిన ఆహారం, పాటించవలసిన ఆరోగ్య జాగ్రత్తల గురించి తెలియజేశారు అదేవిధంగా ప్రతి మంగళవారం మహిళలు, లోప పోషణ పిల్లలు సబ్ సెంటర్ వారిగా రెడ్డిపల్లి పీహెచ్సీ నందు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. గ్రామంలో పిల్లలు, పెద్దలు అందరూ కూడా పూర్వ పద్ధతిలో తీసుకున్నట్టు సమతుల ఆహారం తీసుకోవాలని తెలియజేశారు. మందులు లేకుండా ఎరువులతో పండించిన ఆహారం, పెరటిలో పండించిన ఆకు కూరలు, కూరగాయలను తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి అని సూచించారు.

కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటేనే గ్రామ అభివృద్ధిని, గ్రామ ప్రగతిని సాధిస్తారు. అదేవిధంగా పిల్లలకూ అన్ని రకాల సమతుల ఆహారం తినిపించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండి మంచి విద్యను అభ్యసిస్తారు అని అన్నారు. అలాగే అంగన్వాడి కేంద్రంలో తల్లులకు, పిల్లలకు అందించే సేవల గురించి, గర్భిణీ బాలింతలకు ఆరోగ్యం లక్ష్మీ పథకం ద్వారా ఒక పూట సంపూర్ణ భోజనం అందించడం జరుగుతుంది. ఇట్టి సేవలను తల్లులందరు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మూడు నెలల పాపకు భేటీ జన్మోత్సవ్ ఉయ్యాల కార్యక్రమం చేయడం జరిగింది.

పుట్టిన ఆడపిల్లకు సుకన్య సమృద్ధి యోజన స్కిమ్ తప్పనిసరిగా చేయించుకోవాలని తెలియజేశారు. ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం చేయడమైనది. గర్భిణీలకు శ్రీమంతాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ హేమ భార్గవి మేడం, DRDA Pd శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ స్రవంతి కరుణాకర్,, మెడికల్ ఆఫీసర్ రఘువరన్,వారి హెల్త్ సిబ్బంది, ఐసిడిఎస్ సూపర్వైజర్ సరళ కుమారి, కవిత, శివకుమారి, పంచాయితీ కార్యదర్శి మల్లేష్, HUB కవిత, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు,అంగన్వాడీ టీచర్లు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tags:    

Similar News