Cherlapally: నివాసాల మధ్య సెల్ టవర్లు వద్దు.. కాలనీ వాసుల ఆందోళన
Cherlapally: చర్లపల్లి ఈసీ నగర్‌లో నివాసాల మధ్య సెల్ టవర్ల ఏర్పాటుపై బొంతు శ్రీదేవి యాదవ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు.
Cherlapally: నివాసాల మధ్య సెల్ టవర్లు వద్దు.. కాలనీ వాసుల ఆందోళన
Cherlapally: చర్లపల్లి డివిజన్లోని ఈసీ నగర్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన సెల్ టవర్‌పై కాలనీ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బొంతు శ్రీదేవి యాదవ్ స్పందించి, సెల్ టవర్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు మరియు ఇతర అనర్థాల గురించి సెల్ టవర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ గౌడ్ వారి బృందానికి వివరించారు.
ఈసీ నగర్‌లో సుమారు 70 శాతం మంది సీనియర్ సిటిజన్లు నివసిస్తున్నందున, వారి ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని బొంతు శ్రీదేవి యాదవ్ కాలనీ వాసుల సంతకాలను సేకరించి చర్లపల్లి పోలీస్ స్టేషన్ సీఐ కి వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై సీఐ సానుకూలంగా స్పందించగా, బోర్డు సభ్యులు ఒక వారం రోజుల గడువు కోరారు.
అలాగే కాలనీలో మరో రెండు టవర్స్ కూడా ఇండ్ల మధ్యలో ఉండటంతో, వాటిని కూడా తొలగించేలా చర్యలు తీసుకోవాలని బొంతు శ్రీదేవి యాదవ్ సూచించారు. నివాస ప్రాంతాల్లో సెల్ టవర్స్ ఏర్పాటు చేయకుండా, ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆమె ఆదేశించారు. ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న బొంతు శ్రీదేవి యాదవ్ కి కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.