Chennur: గంజాయి తాగితే జైలుకే.. యువతకు ఏసీపీ హెచ్చరిక
Chennur: చెన్నూర్ మండలం కిష్టంపేట్ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ నిర్మూలనపై జైపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు.
Chennur: గంజాయి తాగితే జైలుకే.. యువతకు ఏసీపీ హెచ్చరిక
Chennur: చెన్నూర్ మండలం కిష్టంపేట్ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ నిర్ములనపై కళాశాల, పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మరియు కిష్టంపేట్, ఎల్లక్కపేట మరియు లింగంపల్లి గ్రామ యువకులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన జైపూర్ ఏసీపీ గారు మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాల మేరకు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని అప్పుడే వారి తల్లి దండ్రుల కష్టానికి ఫలితం దక్కుతుందని అంతేకాని చెడు అలవాట్లకు, గంజాయి త్రాగుటకు మరియు డ్రగ్స్ కు అలవాటుపడి తమ విలువైన బంగారు భవిష్యత్తుని చెడుగొట్టుకోవద్దని అదేవిదంగా ఆరోగ్యాన్ని పాడుచేసుకొనవద్దని తెలిపారు.
విద్యార్థులు మంచి అలవాట్లను అలవర్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని చేరుకునే దిశగా ముందు అడుగులు వేయలే తప్ప చెడు అలవాట్లు చేసుకొని వాటి మత్తులో, ఉద్రేకంలో తప్పులు చేసి నేరాలకు పాల్పడి జైలుపాలు అవకూడదని తెలిపారు. అదేవిధంగా ఇకపై గంజాయి సేవించే వారి పట్ల కఠినంగా చర్యలు వుంటాయని, నిర్మానుష ప్రదేశాలలో గంజాయి సేవించే, మద్యం సేవించే మరియు పేకాట ఆడేవారిని డ్రోన్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారిపై నిఘా ఉంచి పట్టుకొని చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని. చెన్నూర్ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో గంజాయి సేవించే వారి మరియు రవాణా చేసేవారి లిస్ట్ తమవద్ద వున్నదని వారిపై కదలికలపై నిఘావుంచి పట్టుకుంటామని,
అదేవిదంగా గంజాయి సేవించుటకు అలవాటు పడినవారిని గుర్తించి వారిని డీ-అడిక్షన్ సెంటర్ కు తరలిస్తామని, ఈ మధ్యనే చెన్నూర్ పట్టణానికి చెందిన ఒక మైనర్ బాలుడిని మంచిర్యాల డీ- అడిక్షన్ సెంటర్ కు తరలించి చికిత్స చేయిస్తున్నామని. గంజాయి సేవించే మరియు అమ్మకం చేసేవారిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించబోమని తెలిపారు. గంజాయి సేవించడం వల్ల కలిగే అనర్దాలు తద్వారా జరిగే దుష్పరిణామాలకు సంబంధించి కొన్ని పాటల వీడియోస్ లను ప్రాజెక్టర్ ద్వారా విద్యార్థిని విద్యార్థులకు స్క్రీన్ ఫై వేసి వారికి అవగాహన కల్పించడం జరిగినది.
డ్రోన్ కెమెరాతో నిర్మానుష్య ప్రాంతాలను తనిఖీ చేసిన పోలీసులు
చెన్నూర్ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల శివారులోని నిర్మానుష్య ప్రాంతాలలో గంజాయి సేవించే, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే మరియు పేకాట ఆడే వారి ఆగడాలకు చెక్ పెట్టేందుకు చెన్నూర్ పట్టణ పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు, నిత్యం ఈ డ్రోన్ కెమెరాలతో పగలు రాత్రి సమయాలలో పర్యవేక్షిస్తూ ఫై దుష్చర్యలకు పాల్పడే వారిని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జైపూర్ ఏసీపీ, చెన్నూర్ సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ ఎస్ ఐ లు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, కిష్టంపేట్, లింగంపల్లి సర్పంచులు, కళాశాల ఉపాధ్యాయ బృందం, యువకులు, విద్యార్థిని విద్యార్థులు మరియు చెన్నూర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.