Karimnagar: చొప్పదండి ప్రమాద కేసులో కీలక తీర్పు.. నిందితుడికి కఠిన శిక్ష
Karimnagar: చొప్పదండి రోడ్డు ప్రమాద కేసులో కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయస్థానం కీలక తీర్పు.
Karimnagar: చొప్పదండి ప్రమాద కేసులో కీలక తీర్పు.. నిందితుడికి కఠిన శిక్ష
Karimnagar: కరీంనగర్ జిల్లా చొప్పదండి పరిధిలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మద్యం మత్తులో కార్ నడుపుతూ ఆటోను ఢీకొట్టి ఒక మహిళ మృతి చెందడంతో పాటు మరో నలుగురికి గాయాలకు కారణమైన వల్లంపాడ్ గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తికి కరీంనగర్ ప్రిన్సిపల్ మరియు జిల్లా ప్రధాన న్యాయస్థానం ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
ఈ ఘటనలో నిర్లక్ష్యంగా, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఒక కుటుంబం దుఃఖంలో మునిగిపోవడంతో పాటు పలువురు గాయపడిన విషయం విచారణలో తేలింది. కేసును సమగ్రంగా పరిశీలించిన న్యాయస్థానం నిందితుడి తప్పిదాన్ని నిరూపిస్తూ కఠిన శిక్షను విధించింది.
ఈ కేసు విచారణలో కీలక పాత్ర పోషించిన అప్పటి చొప్పదండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, అలాగే కేసు ప్రాసిక్యూషన్‌ను సమర్థంగా ముందుకు నడిపించిన ప్రస్తుత CI ప్రదీప్ కుమార్, SI నరేష్ రెడ్డి మరియు కోర్ట్ కానిస్టేబుల్ శ్రీధర్‌లను పోలీస్ కమిషనర్ (CP) మరియు రూరల్ ఏసీపీ అభినందించారు. వారి కృషి వల్లే నిందితుడికి తగిన శిక్ష పడిందని అధికారులు పేర్కొన్నారు. ఈ తీర్పు మద్యం సేవించి వాహనాలు నడిపే వారికీ గట్టి హెచ్చరికగా నిలుస్తుందని, రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.