Adilabad: బిజెపి ఎమ్మెల్యే, ఎంపీ పై మాజీ మంత్రి ఫిర్యాదు!

Adilabad: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ డూప్లికేట్ మాస్టర్ ప్లాన్ విడుదల చేశారంటూ బీజేపీ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ లపై మాజీ మంత్రి జోగు రామన్న ఫిర్యాదు చేశారు.

Update: 2026-04-10 14:01 GMT

Adilabad: బిజెపి ఎమ్మెల్యే, ఎంపీ పై మాజీ మంత్రి ఫిర్యాదు!

Adilabad: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో ఎంపీ నగేష్ ఎమ్మెల్యే శంకర్ మాస్టర్ ప్లాన్ అంటూ విడుదల చేసిన మోసపూరిత మాస్టర్ ప్లాన్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు, మరో పక్క కేంద్ర విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎలాంటి మాస్టర్ ప్లాన్ రూపుదిద్దడం జరగలేదని పత్రికాముఖంగా తెలిపారని,

ఎంపీ ఎమ్మెల్యే మోసపూరిత ప్రకటనలతో ఆదిలాబాద్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. తక్షణం ఎంపీ ఎమ్మెల్యే పై 420 కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా డిపిఓ కార్యాలయంలో asp మౌనిక కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ఫిబ్రవరి 24న డూప్లికేట్ మాస్టర్ ప్లాన్ తయారు చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎంపీ నగేష్ డూప్లికేట్ మాస్టర్ ప్లాన్ ను,

రూపొందించి విడుదల చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.. కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈనెల 17న బృందాలతో సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపిన ఎమ్మెల్యే మోసపూరిత ప్రకటనలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దని అన్నారు. తక్షణం వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News