Rain: హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం

Hyderabad Rains: నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

Update: 2024-04-20 03:44 GMT

Rain: హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం

Hyderabad Rains: నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో తేలిపాటి వర్షాలతో.. ఇన్ని రోజులుగా ఉన్న ఉక్కపోతకు అల్లాడిన జనాలకు ఉపశమనం లభించింది. గ్రేటర్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సరూర్‌నగర్, మలక్‌పేట, కోఠి, విద్యానగర్, నల్లకుంట, తార్నాక, నాచారం, మల్లాపూర్, లో చిరుజల్లులు కురుస్తున్నాయి.

ఇకసిటీ శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్, శివరాంపల్లి, బాబుల్‌రెడ్డినగర్‌, నేతాజీనగర్, రాజేంద్రనగర్, పద్మశాలినగర్, మధుబన్‌కాలనీ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతమై కురుస్తున్న వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండవేడిమి, వడగాల్పులతో అల్లాడుతున్న జనాలకు ఈ వర్షాలు కాస్త ఊరటనిచ్చాయి.

Tags:    

Similar News