వరంగల్ జిల్లాలో విషాదం ఊరుగొండ వ్యవసాయ బావిలో తల్లీకూతుళ్ల మృతదేహాలు!
* కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసుల అనుమానం
వరంగల్ జిల్లాలో విషాదం ఊరుగొండ వ్యవసాయ బావిలో తల్లీకూతుళ్ల మృతదేహాలు
Suicide: వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దామెర మండలం ఊరుగొండ వ్యవసాయ బావిలో తల్లీకూతుళ్ల మృతదేహాలను గ్రామస్తులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. మృతులు ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామానికి చెందిన నిమ్మల ఆమని, 10 నెలలు చిన్నారిగా గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.