PM Modi: హైదరాబాద్‌ చేరుకున్న ప్రధాని మోడీ.. ఈసారి పర్యటనలో స్వాగతం పలకని తెలంగాణ మంత్రులు

PM Modi: ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు.

Update: 2023-07-08 05:14 GMT

PM Modi: హైదరాబాద్‌ చేరుకున్న ప్రధాని మోడీ.. ఈసారి పర్యటనలో స్వాగతం పలకని తెలంగాణ మంత్రులు

PM Modi: ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఓరుగల్లులో పర్యటించేందుకు ప్రధాని మోడీ హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోడీ.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌ వెళ్లనున్నారు. ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఈసారి పర్యటనలో ప్రధానికి తెలంగాణ మంత్రులెవరూ స్వాగతం పలకలేదు. ప్రధాని మోడీకి సీఎస్, డీజీపీ, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. మోడీ అధికారిక పర్యటనలో తెలంగాణ సీఎం, మంత్రులు ఎవరూ పాల్గొనడం లేదు. మోడీ సభలో కేసీఆర్ ప్రసంగం కోసం సమయం కేటాయించారు.

Tags:    

Similar News