సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రధాని మోడీ, గవర్నర్ తమిళిసై
CM KCR Birthday: సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రధాని మోడీ, గవర్నర్ తమిళిసై
CM KCR Birthday: సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ చెప్పిన ప్రధాని మోడీ... సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఇక తెలంగాణ గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ట్విట్టర్ వేదికగా విషెస్ తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవితం అర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.