Hyderabad: ఫిర్యాదు చేసినా నో రెస్పాన్స్.. పామును తీసుకెళ్లి..
GHMC కార్యాలయంలో టేబుల్‌పై పాము పెట్టి నిరసన
Hyderabad: ఫిర్యాదు చేసినా నో రెస్పాన్స్.. పామును తీసుకెళ్లి..
Hyderabad: GHMC కార్యాలయంలో టేబుల్‌పై పాము పెట్టి నిరసన తెలిపాడు ఓ వ్యక్తి. నగరంలో భారీ వర్షాలు పడుతుండగా.. అల్వాల్ ప్రాంతంలో ఇళ్లలోకి వరదనీరు చేరుతోంది. ఓ ఇంట్లోకి పాము కూడా రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఈ విషయంపై అధికారులకు సమాచారమిచ్చారు. అయితే ఫిర్యాదు చేసి 6 గంటలైనా అధికారులు స్పందించలేదనే ఆగ్రహంతో.. సంపత్ కుమార్ అనే యువకుడు పామును GHMC ఆఫీస్‌కు తీసుకొచ్చాడు. టేబుల్‌పై పామును పెట్టి తన నిరసన తెలియజేశాడు.