తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటనను నిరసిస్తూ వామపక్ష పార్టీల నిరసన

* హైదరాబాద్ లిబర్టీలోని ఏఐటీయూసీ ఆఫీస్‌ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ

Update: 2022-11-12 03:44 GMT

తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటనను నిరసిస్తూ వామపక్ష పార్టీల నిరసన

Left Parties: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటనను నిరసిస్తూ వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. విభజన హమీలు నెరవేర్చాకే తెలంగాణలో అడుగుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లిబర్టీలోని ఏఐటీయూసీ నుండి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, వామపక్ష పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొననున్నారు. నిరసన ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ప్రధాని మోడీ సభజరిగే రామగుండం ప్రాంతానికి వామపక్ష కార్మిక అనుంబంధ సంఘాల నేతలు చేరుకున్నారు.

Tags:    

Similar News