ఖైరతాబాద్ గణేశుడి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా

Khairatabad Ganpati Live Darshan : ప్రతి ఏడాది గణపతి నవరాత్రులు మొదలయ్యాయంటే చాలు ఎక్కడెక్కడి నుంచో భక్తులు నగరంలోని ఖైరతాబాద్ వినాయకుని దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటారు.

Update: 2020-08-24 09:42 GMT

ఖైరతాబాద్ గణపతి 

Khairatabad Ganpati Live Darshan : ప్రతి ఏడాది గణపతి నవరాత్రులు మొదలయ్యాయంటే చాలు ఎక్కడెక్కడి నుంచో భక్తులు నగరంలోని ఖైరతాబాద్ వినాయకుని దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటారు. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా ఖైరతాబాద్ వినాయకుని దర్శణానికి భక్తులను అనుమతించడం లేదు. దీంతో ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు నిరాశే ఎదురవుతుంది.

ఇదిలా ఉంటే భక్తులను దృష్టిలో పెట్టుకున్న ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఓ మంచి ఆలోచన చేసారు. ఖైరతాబాద్ గణేశ్ మహరాజ్ ని నేరుగా కాకుండా ఆన్ లైన్ లో దర్శించుకునేట్టుగా ఏర్పాట్లు చేసారు. భక్తులు భారీ సంఖ్యలో ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి వస్తుండటంతో భౌతిక దూరం లేకపోవడం వంటి కోవిడ్ నిబంధనల ఉల్లంఘం జరుగుతోందని ఉత్సవ సమితి నిర్వాహకులు పేర్కొన్నారు. దీంతో భక్తులందరూ ఖైరతాబాద్ గణేశుడిని ఆన్‌లైన్‌లో దర్శించుకోవాలని ఉత్సవ సమితి కోరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో భక్తులెవరూ దర్శనం కోసం ఖైరతాబాద్ కు రావద్దని, కోవిడ్ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేసింది.

ఖైరతాబాద్ గణేశుడిని ఆన్‌లైన్‌లో www.ganapathideva.org వెబ్‌సైట్ ద్వారా దర్శించుకోవాలని ఉత్సవ సమితి భక్తులను కోరింది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశుడిని ప్రతిష్టించిన పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. అంతే కాదు గణపతి దర్శన సమయాలను కూడా ఉత్సవ సమితి కుదించారు. కొద్ది పాటి భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. అది కూడా ఉదయం 5 గం.ల నుంచి 10.30 గం.ల వరకు..సాయంత్రం 4 గం.ల నుంచి 10 గం.ల వరకు తక్కువ సంఖ్యలో భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు.

Tags:    

Similar News