ఈ సారి భక్తులకు నిరాశే మిగిలింది

ఈ సారి భక్తులకు నిరాశే మిగిలింది
x

ప్రతీకాత్మక చిత్రం 

Highlights

Devotees Unhappy : గణపతి నవరాత్రులు ప్రారంభం అయితే చాలు హైదరాబాద్ నగరంలోని ప్రజలు ఎక్కువగా ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవడానికే ఎక్కువగా మక్కువ చూపుతారు.

Devotees Unhappy : గణపతి నవరాత్రులు ప్రారంభం అయితే చాలు హైదరాబాద్ నగరంలోని ప్రజలు ఎక్కువగా ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవడానికే ఎక్కువగా మక్కువ చూపుతారు. ప్రతి ఏడాది ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా భక్తులు తరలివస్తుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఖైరతాబాద్ గణేశుణ్ని దర్శించుకొనేందుకు పోలీసులు అనుమతించలేదు. కరోనా ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా పోలీసులు, అధికారులు మండపానికి పరదా వేసేశారు. అంతే కాదు కమిటీ సభ్యులు కూడా పోలీసుల ఆదేశాను సారం మండపంలోకి భక్తులను అనుమతించకుండా చేశారు.

దర్శనానికి వచ్చిన భక్తులందరికీ దూరం నుంచే దర్శించుకొనేలా ఏర్పాటు చేశారు. దీంతో ఆ గణనాథుడు కనిపించీ కనిపించకుండా ఉడడంతో భక్తులు నిరాశతో వెనక్కి వెళ్తున్నారు. అయితే రోడ్డుమీది నుంచే అంతా దర్శనం చేసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే కమిటీ సభ్యుల నిర్ణయాన్ని భజరంగ్ దళ్ సభ్యులు వ్యతిరేకించారు. పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడకు చేరుకుని ఆందోళన కారులను చెదరగొట్టారు. అక్కడే ఆందోళన చేపట్టారు. గణేష్‌కు అడ్డంగా పరదాల వంటివి కట్టొద్దని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే నిరసన కారులకు పోలీసులకు మధ్య ఘర్షణ ఏర్పడి ఉద్రిక్తతకు దారి తీసింది.

ఇక ఈ సారి హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణనాధుడి ప్రేత్యేకత వేరు. ఈ గణనాధుడికి ఈ ఏడాది 100 కిలోల లడ్డూ ప్రసాదం సిద్దం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని సురుచి సంస్థ 100 కిలోల లడ్డూను తయారు చేసింది. సురుచి సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిఖార్జునరావు అధ్వర్యంలో ఈ లడ్డును సిద్దం చేసి ఆ లడ్డుపై వినాయకుడి ప్రతిమను తెర్చిదిద్దారు.

అయితే, ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు దేవతల వైద్యుడైన ధన్వంతరి అవతారంలో దర్శనం ఇవ్వనున్నాడు. గత సంవత్సరం భారీ ఎత్తులో వినాయకుడి విగ్రహం పెట్టిన నిర్వాహకులు ఈ సరి కేవలం 9 అడుగుల ఎత్తులో విగ్రహం ఉంది అని తెలిపారు. అంతే కాదు ఈ విగ్రహంలో ఓ వైపు లక్ష్మీదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలను ఏర్పాటు.. పర్యావరణ హితంగా ఈసారి విగ్రహాన్నిమట్టితో తీర్చిదిద్దారు. వరుసగా 66వ సారి నిర్వహకులు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. అదే విదంగా గత ఏడాదికి భిన్నంగా గణేష్ కమిటీ నిమజ్జన ఏర్పాట్లు కూడా చేస్తునట్లు సమాచారం.

ప్రతి ఏడాది ప్రతిష్టించే హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణపతికి ఎంత విశిష్టత మనక తెలిసిందే.. అయితే, ఈ ఏడాది రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కారణంగా పరిస్థితులు ఒక్క సరిగా మారిపోయాయి. ఖైరతాబాద్ కమిటీ నిర్వహకులు చరిత్రలోనే తొలిసారిగా చిన్న గణేష్ ప్రతిమను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఖైరతాబాద్ గణేష్ కమిటీ చుస్తే.. మొదట్లో 1970లో ఖైరతాబాద్‌లో 9 అడుగుల వినాయకుడ్ని ప్రతిష్ఠించారు. అయితే మళ్ళి సుమారు 50 ఏళ్ళ తరువాత రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా 9 అడుగుల ఎత్తులో గణపతి విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తున్నామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories