Weather News: తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా.. గజగజ వణుకుతున్న జనం

*విశాఖ, లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలు *హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 17.5 డిగ్రీలు

Update: 2021-12-17 04:44 GMT

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా(ఫోటో: ది హన్స్ ఇండియా)

Weather News: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ట్రోగతలు తీవ్రస్థాయిలో పడిపోతున్నాయి. జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రంగా ఉండడంతో గజగజ వణికిపోతున్నారు. ఈశాన్య, వాయవ్య భారత్ నుంచి వీస్తున్న గాలులతో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. విశాఖ, లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలు నమోదవుతున్నాయి. అరకులోయలో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దట్టమైన పొగ మంచుతో గిరిజనులు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు ఈశాన్య, వాయవ్య భారత్ నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతంది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ లో చలి తీవ్ర ఎక్కువగా ఉంది. అటు ఏపీలోని విశాఖ జిల్లా, ఏజెన్సీ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు హైదరాబాద్ లోనూ మధ్యాహ్నం 12 గంటల వరకు చలిగాలులు వణుకుపుట్టిస్తున్నాయి.

భాగ్యనగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 17.5 డిగ్రీలుగా నమోదైంది. అటు రంగారెడ్డి జిల్లాలో 15.7 డిగ్రీలు, మేడ్చల్ జిల్లాలో 16.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలకు మించి ఉండడంలేదని వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ఠ , గరిష్ట ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం నాలుగైదు డిగ్రీలకు మించి దాటటం లేదని తెలిపింది. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. గతంలో ఇంతటి స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం జరగలేదని తెలిపారు.

Full View


Tags:    

Similar News